జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగా భవాని జాతర సోమవారం రాత్రి కోళా హాలంగా జరిగినది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుండి కూడ లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించికుని మొక్కులు తీర్చుకున్నారు. ఆరు విద్యుత్ ప్రభల ఏర్పాటు చేయగా, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రభలు దేవాలయానికి రెండు వైపుల ఉండటంతో భక్తులు ఆయా ప్రభల వద్దకు అధిక సంఖ్యలో వేళ్లారు. ఎక్కువ సమయం ఆయా ప్రభల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, పార్లమెంటు ఇన్చార్జి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి టిడిపీ దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్లు, కాంగ్రెస్పార్టీ రాష్ట్ర మీడియా చైర్ పర్సన్ ఎన్ తులసి రెడ్డి, అధికార ప్రతినిథి షేక్ సైదా, మాజీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిథులు మస్తాన్ వలి, షేక్ సైదా, అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్, దర్శి నియోజక వర్గ ఇన్చార్జి కైపు క్రిష్ణా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీర బ్రహ్మం లు ఆయా పార్టీల ప్రభల మీద నుండి ప్రజలకు కార్యకర్తలను ఉద్దేశించి వారిని ఉత్తేజ పరస్తూ సందేశం ఇచ్చారు. ఆయా పార్టీల మండల నాయకులు అధినాయకులతో ఘన స్వాగతం పలికారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు… ఆయా ప్రభలపై నిర్వాహకులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. గతంలో కన్నా భిన్నంగా కొంచెం హుసారుగా పాటలు పాడుతూ లయ బద్దంగా అనుకరించటంతో ప్రజలు ప్రభల వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకించారు.
గుంటి గంగా తిరునాళ్ల హుండీ ఆదాయం రూ.7,42,158
గుంటి గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి భక్తుల సందర్శన వలన వచ్చిన హుండీ ఆదాయం రూ.రూ.7,42,158 లని ఆలయ ఈఓ వాసు తెలిపారు. హుండీ ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. భక్తుల తాకిడి పెరిగినప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శన ఏర్పాట్లను దేవాదాయ శాఖ చేయటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేసారు. కమిటీ చైర్మన్, కొసనా గురు బ్రహ్మం జె పంగలూరు గ్రూపు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి యూ శ్రీనివాసరావు, పూజారులు లు భక్తులకు సౌకర్యాలు కల్పించటంతో శ్రమించారు.




