గత టీడీపీ ప్రభుత్వంలో స్మశానాల అభివృద్దిపేరిటపంచాయతీ, దాతల సహాకారంతో నిధులు సమకూర్చి నిర్మించిన స్మశాన ప్రహరీ గోడను కూల్చి స్మశాన స్థలాన్ని గ్రామ ఉపసర్పంచ్ ఎన్ .రామ్మూర్తి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ విషయంమై గ్రామస్తులు పలువురు అధికారులకు ఫిర్యాధులు చేశారు. వివరాల్లోకి వెలితే శివరాంపురం గ్రామం నుండి…. ఉమ్మనేని పాలెం వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 70/16లో 1.08 సెంట్లలో హిందూ స్మశానం ఉంది. ఆ స్థలం పూర్తి చెట్లతో నిండి పోవటంతో గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామానికి చెందిన ఆలోకం సూర్యనారాయణ గ్రామపంచాయతీ నిధులు, దాతలసహకారంతో స్మశానవాటిక చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. ఈ స్మశాన వాటికలో గ్రామానికి చెందిన 14 కులాలకు చెందిన వారు దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. ఆ గ్రామ ఉపసర్పంచ్ స్మశానస్థలంలో 20సెంట్లు ఆక్రమించాడని, ఆక్రమణల చెరనుం. 20సెంట్లు ఆక్రమించాడని, ఆక్రమణల చెరనుం డి స్మశానాన్ని కాపాడాలని సూర్యానార్యాయణ అనేక మార్లు జిల్లా అధికారులకు గ్రీవెన్ సెల్ లో అర్జీలు ఇచ్చినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదిలా వుండగా గ్రామ ఉపసర్పంచ్ తన స్థలంలోకి వెళ్లేందుకు బాట లేదంటూ ఆస్మశాన స్థలంలో బాట వేసేందుకు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చినదంటూ ఏకంగా తన స్థలంలోకి వెళ్లేందుకు అడ్డుగా వుందంటూ స్మశాన స్థల ప్రహరీగోడను 15 అడుగుల మేర దౌర్జన్యంగా కూల్చివేశారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పందించి 14 కులాల వారికి చెందిన హిందూ స్మశాన వాటిలోని ఆక్రమణలు తొలగించి స్మశానాన్ని కా పాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
