బేగంపేట ఏప్రిల్ 16(జె ఎస్ డి ఎం న్యూస్) :
ఈ నెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభ ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కబి ఆర్ ఎస్ సైనికుడు చలో వరంగల్ సభ కు తరలి వెళ్లాలని పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం పద్మారావు నగర్ లోని బిల్వర్డ్ గార్డెన్ లో జరిగిన బి ఆర్ ఎస్ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా గుర్రం పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక 2001 ఏప్రిల్ 27న కెసిఆర్ తన పసభపతి పదవికి, తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసి తెరాస పార్టీ నీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా కెసిఆర్ వరంగల్ లో సభ నిర్వహించనున్న విషయం మన అందరికి తెలిసిందేనని అయన వివిరించారు. గడచినా 16నెలల లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పూర్తిగా ప్రజల అగ్రహానికి గురైందని అయన పేర్కొన్నారు. కల్లబొల్లి హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందని, కానీ ఈ రోజు ఎక్కడ చూసినా ప్రజలు కెసిఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని పవన్ కుమార్ గౌడ్ వివరించారు. రాబోయే రోజుల్లో తప్ప కుండా బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం లోకి రావడం కాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి గుబులు పుట్టించే విధంగా ప్రతి కార్యకర్త తరలి రావాలని పవన్ కుమార్ గౌడ్ కోరారు. మన నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు 500మంది ఈ సభ కు తరలి రావాలని ఆయన కోరారు. పద్మారావు నగర్ కూడలి లో పార్టీ జెండా ను ఎగురవేసి అందరం భారీ ఎత్తున వరంగల్ కు తరలి రావాలని కోరారు.డివిజన్ అధ్యక్షులు రాజు అధ్యక్షత వహించిన సభ లో ఏసూరి మహేష్, పుషవంత్ రెడ్డి, జి ఎస్ మహేందర్, మిట్టపల్లి జగ్గయ్య, రమణ, శ్రీకాంత్ రెడ్డి, అనిత రెడ్డి, నాగలక్ష్మి, షాహిద్, తదితరులు పాల్గొన్నారు.
