దాసరం బస్తీలో నిర్మాణాలు ప్రారంభం తో గుడిసె వాసుల్లో ఆందోళన……గుడిసె వాసులకు అండగా ఉంటా.. సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా. కోట నీలిమ.

సనత్ నగర్ ఏప్రిల్ 16(జే ఎస్ డి ఎం న్యూస్) : సనత్‌నగర్ నియోజకవర్గంలోని
దాసారం బస్తీలోని ఖాళీ స్థలంలో అకస్మాత్తుగా నిర్మాణాలు ప్రారంభం కావడం తో ఒక్క సారిగా గుడిసె వాసుల్లో ఆందోళన మొదలైంది.ఎన్నో ఏళ్లుగా ఖాళీ స్థలంలో వుంటున్న పేదలు ఒక్క సారిగా నిర్మాణాలు ప్రారంభ కావడం తో వారిలో ఆందోళన మొదలైంది.ఇన్ని రోజులు తమ కు నీడ నిచ్చిన స్థలంలో నిర్మాణాలు ప్రారంభం కావడం పేదలు జీర్ణించు కో లేక పోతున్నారు.నిర్మాణాలు ప్రారంభించడం తో అక్కడ తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్న దాదాపు మూడువందల మంది నిరుపేద నివాసితులు ఆందోళన వ్యక్తంచేశారు. ఏళ్ళతరబడి ఇక్కడ గుడిసెలు ఏర్పాటుచేసుకుని దినసరి కూలీ, ఇతరత్రా పనులుచేసుకుంటూ పొట్టకూటికోసం పాటుపడుతున్న తమకు
ఉన్న గూడు కూడా కరువైతే కుటుంబాలు ఎక్కడ నివసించాలని మనోవేదన చెందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సనత్‌నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ బస్తీని సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థలం గురించి వాస్తవాలను తెలుసుకుని, పేదల కు అమోద్యయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని,పేద గుడిసె వాసులకు తాను అండగా ఉంటానని డా.కోట నీలిమ గుడిసె వాసులకు భరోసా ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *