పశ్చిమబెంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సపోర్టుతో అక్కడి ముస్లిమ్స్ మరియు దేశంలో చొరబడిన రోహింగ్యాలు హిందువులపై దాడులు చేస్తు, హిందువులకు చెందిన వేలాది ఎకరాల పంటపొలాలను ధ్వంసం చేస్తూ… హిందులను గ్రామాలనుండి తరిమివేస్తు బెంగాల్ ను మరో కాశ్మీరుగా చేస్తున్న నేపథ్యంలో బెంగాల్ హిందువులను రక్షించని మమతా బెనర్జీ పాలనను రద్దుచేసి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని, హిందువులను రక్షించాలని, అక్రమ చొరబాటుదార్లు రోహింగ్యాలను దేశంనుండి తరిమికొట్టాలని కోరుతూ… విశ్వహిందూ పరిషత్ ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు నేతృత్వంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం – ధర్నాస్థలి వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో చింతలపూడి శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు మాట్లాడుతూ వక్ఫ్ చట్టం సవరణలు పార్లమెంట్ చట్టసభల్లో ఆమోదం పొందిన తరువాత దేశంలోని ముస్లిమ్స్, తమ అధిక జనాభా గల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అరాచకాలు సృష్టిస్తూ, హిందువుల ఇళ్లను దోచుకుంటూ, హిందువులను ఇళ్ల నుండి తరిమివేస్తూ… మహిళలను పిల్లలను హింసిస్తూ, పంట పొలాలను సైతం ధ్వంసం చేస్తున్న వారిని శిక్షించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ చొరబాటుదారులు మరియు అరాచక ముస్లిం మూకలకు సపోర్టుగా ఉండి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న తరుణంలో విశ్వహిందూ పరిషత్ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ పాలనను భర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారని తెలిపారు. ఆ నేపధ్యంలో నేడు కలెక్టర్ ద్వారా రాష్త్రపతికి వినతిపత్రం పంపామని తెలిపారు.
విహెచ్పి జిల్లా కార్యదర్శి ఈమని బలరాం మాట్లాడుతూ బెంగాల్లోని హిందువులను రక్షించేలా, అరాచక శక్తులను తుదముట్టించ్చే విధంగా… బెంగాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన అమలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రం పంపించామని తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున రావు, కార్యదర్శి ఈమని బలరాం, సాధు శ్రీనివాసగుప్తా, పసుమర్తి వెంకటేశ్వర్లు, వేమూరి చక్రధర పెరుమాళ్ళు, సుంకు రఘు, త్రిపుర భైరవేశ్వరానంద స్వామి, యం. వేంకటేశ్వర్లు, వేంకటేశ్వరరెడ్డి, బోయపాటి రవి, బి విజయరావు, తీగల సత్యవతి, జువ్విగుంట కోటేశ్వరి, దేసు వెంకయ్య, చీమకుర్తి శివప్రసాద్, ధనిశెట్టి రామునాయుడు, ప్రచిర ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం తదితర విశ్వహిందూ పరిషత్ కారాయకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు.


