ఘనంగా జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం నిర్వహణ

తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎంపీడీఓ దార హనుమంతరావు, డిప్యూటీ ఎంపీడీఓ సుందర రామయ్యల ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్టికల్ 73వ ఆర్టికల్ ద్వారా పంచాయితీలకు సర్వాధికారాలు వచ్చాయని దీంతో పంచాయితీల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అయిందని అన్నారు. అదేవిధంగా మండలంలోని పలు పంచాయితీలలో జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యా లయ ఎస్ఓ సొనికొమ్ము సత్యం, తాళ్లూరు గ్రామ కార్యదర్శి ఐ రమణా రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచిలు, సచివాలయసిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *