పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తాళ్లూరు మండల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి సత్తా చాటారు. మండలంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుండి 686 మంది పరీక్షలకు హాజరు కాగా 514 మంది 75శాతం మంది ఉత్తీర్ణులు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావులు తెలిపారు. అందులో ప్రభుత్వ పాఠశాలల నుండి 279 మంది హాజరు కాగా 155 మంది 56శాతం పాస్ అయినట్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుండి 407 మంది హాజరు కాగా 359 మంది 88శాతం పాస్ అయినట్లు వివరించారు.
తాళ్లూరులో శ్రీ సరస్వతి హైస్కూల్ కు చెందిన విద్యార్థి చల్లా రేవతి (591), ఈశ్వర్ నాయక్ (586), వేమి రెడ్డిబార్గవి (586), బిస్నేహలత (586)లు సాధించారు. తూర్పుగంగవరంకు చెందిన గీతాంజలి హైస్కూల్ విద్యార్థి కె. శివప్రసాద్ (590), తాళ్లూరు ఎబీసీ హైస్కూల్ కి చెందిన ఐ స్నేహితా రెడ్డి (587), ఎం లావణ్య (586), కొణికి సిద్ధార్థ (580) లు సాధించారు.
శారద హైస్కూల్ కి చెందిన షేక్ మాలిక్ (584), అమెరికా పబ్లిక్ స్కూల్ విద్యార్థి సిహెచ్ మనోజ్ (581), వాసంతి (571), గంగా హైస్కూల్ విద్యార్థి జి శివ సంజన (580), శివ శంకర్ (576), సాధించారు. జాహ్నవి హైస్కూల్ విద్యార్థి జి నవిత రెడ్డి (561), ప్రగతి హైస్కూల్ విద్యార్థి ఎ త్రివేణి (543) సాధించి ఆయా పాఠశాలలలో మొదటి ర్యాంక్లు సాధించారు. విద్యార్థులను ఎంఈఓ జి సుబ్బయ్య, ఆయా పాఠశాలల కరస్పాండెంట్స్,ప్రధానోపాధ్యాయులు, డైరెక్టర్స్ అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత శాతం..
తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో కంటే ఉత్తీర్ణత శాతం తగ్గింది. తాళ్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉత్తీర్ణత మండలంలోనే అత్యంత దారు ణంగా పడిపోయింది. 48 విద్యార్థులకు కేవలం ఏడుగురు మాత్రమే ఉత్తీర్ణుల య్యారు. బొద్దికూరపాడులో 68మందికి 38మంది, తూర్పుగంగవరం హైస్కూ ల్లో లో 65 మందికి 36 మంది, కేజీబీవీ విద్యాలయంలో 32 మందికి 17 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధిం చారు. మిగిలిన స్కూళ్లల్లోనూ ఆశించిన ఉత్తీర్ణత శాతం నమోదు కాలేదు.


