జిల్లా టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి, సీనియర్ నాయకుడు మానం రమేష్ సతీమణి సుబ్బారత్తమ్మను దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు
గురువారం పరామర్శించారు. సుబ్బా రత్తమ్మ గతకొంతకాలంగా అనారోగ్యంతో వుండి హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం విఠలాపురంవచ్చారు. సమాచారం అందుకున్న గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులు ఆమెను పరామర్శించారు. ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకుని, వ్యాధి పూర్తిగా నయమవుతుందని, ఆందోళన చెంద వద్దని భరోసా ఇచ్చారు. వారి వెంట ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు,నవులూరి సురేంద్రమోహన్,వెంకటేశ్వరరెడ్డి, షేక్ కాలేషావలి, శాగంకొండారెడ్డి, రాచకొండ వెంకట రావు,వేణుబాబు, విద్యాసాగర్, తదిత రులుపాల్గొన్నారు.
