జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్ర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు…………..

రాంగోపాల్ పేట ఏప్రిల్ 24(జె ఎస్ డి ఎం న్యూస్):
జమ్ము కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్ర మూకలు భారతీయులపై జరిపిన దాడిలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ నేతృత్వంలో సనత్నగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం రాంగోపాల్పేట డివిజన్ ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం వద్దల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల చిత్రపటా వద్ద కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలియజేశారు వారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు ఈ సందర్భంగా త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రముకల చర్యను ప్రతి భారతీయుడు తీవ్రంగా ఖండించాలన్నారు వారు జరిపిన దారుణ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలన్నారు ఇలాంటి చర్యలను పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఖండించాలని మనోజ్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ తో పాటు పంచముఖి హనుమాన్ ఆలయం చైర్మన్ బచ్చురాజ్ కు, డిసిసి సెక్రెటరీ హేమంత్ ఠాగూర్, రాంగోపాల్ పేట్ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శీలం జయ, ఎస్ ఆర్ శివకుమార్, మహేష్ కుమార్ కటారి ,నాగరాజ్, మాణిక్యం ప్రభు, నజీరుద్దీన్ (అడ్డు), రఘు యాదవ్, వెంకట్ ,పాండుగౌడ్, నారాయణ ముదిరాజ్, శ్రీనివాస ముదిరాజ్, శ్రీశైలం, యాసిన్ కురేసియా, అజార్, అమీర్ ఖాన్ ,కృష్ణ, బబ్లు , ముష్ర తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *