మహాల్గామా దాడి అత్యంత హృదయ విదారకం…..మణికొండ లో నివాళులు…

మణికొండ ఏప్రిల్ 24,
జమ్మూ కాశ్మీర్లోని పహాల్ గామా దాడి అత్యంత హృదయ విధానమైనదనీ, ఈ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ.గాయపడిన వారు తీవ్రంగా కోలుకోవాలని ప్రార్థిస్తూ,భారత వికాస్ పరిషత్ జిజీయా భాయ్ శాఖ మణికొండ ,సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ మణికొండ ,నవ సేవా సంకల్పం,వివేకానంద అసోసియేషన్ లఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.ఇది దేశ ఐక్యత సమగ్రతపై దాడి అని, ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ,సంఘాలు తమ తమ విభేదాలను పక్కనపెట్టి, ఉగ్రవాద చర్యలు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ ప్రాంత జాయింట్ జనరల్ సెక్రటరీ రఘు సతీష్ కుమార్, జిజియా బాయ్ బ్రాంచ్ సెక్రటరీ బాల భారతి,ప్రెసిడెంట్ పెంటా రెడ్డి ,ట్రెజరర్ అజయ్ కుమార్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు ప్రభుజి వందన,సుమారు 200 మంది క్యాండిల్స్ ర్యాలీ ని ఎంప్లాయిస్ కాలనీలో నిర్వహించి నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *