బేగంపేట ఏప్రిల్ 24 జే ఎస్ డి ఎం న్యూస్ :
జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామా దాడి ని ప్రతి ఒక్కరు ఖండించాలని సనత్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్ అన్నారు.ఇది అత్యంత హృదయ విధారకరమైందని ఈ ఉగ్రదాడిలో మరణించిన వారికినివాళులర్పిస్తూ.గాయపడిన వారు తీవ్రంగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, సనత్ నగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్ర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లో యూత్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.
