ఎన్ టి ఏ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న నీట్ వ్రాత పరీక్షా సజావుగా సాగేందుకు జిల్లాలో ఐదు సెంటర్ లో డి. ఆర్. ఆర్. ఎం , జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల మరియు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
మొత్తం 5 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 1473 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షకు హాజరుకానున్నట్లు జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ తెలిపారు. ఈ నీట్ పరీక్ష నిర్వహించే పరీక్షా కేంద్రలను జిల్లా ఎస్పీ సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు తెలియచేసినారు.
పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్ లు, బ్లూ టూత్, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్సును అనుమతించరాదని, పరీక్ష వ్రాసేందుకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని పూర్తిగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసిన తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతించాలన్నారు. ముఖ్యంగా, పరీక్షా కేంద్రాల పరిసరాల్లోకి అనధికార వ్యక్తులు ఎవరూ రాకుండా చూడాలని, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎటువంటి అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పరీక్ష నిర్వహక అధికారులకు ఎస్పీ తెలియజేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన నీట్ పరీక్ష జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే ఈ పరీక్ష ప్రశాంతంగా, సజావుగా జరగటానికి అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల వెలుపల 144 సెక్షన్ అమలులో ఉందని, ఈ పరీక్షలు ముగిశాక ఆ పత్రాలు పటిష్ట భద్రతా నడుమ స్ట్రాంగు రూంలకు తరలించడం జరిగిందని, పరీక్షా కేంద్రాల పరిసరాలలో జిరాక్స్ మరియు ఇంటర్నెట్ సెంటర్లు ముందుగానే మూయించామని, ప్రతి ‘నీట్’ పరీక్షా కేంద్రాల పరిసరాల వద్ద డ్రోన్ కెమెరా తో నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అని జిల్లా ఎస్పి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేలా పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని చర్యలు తీసుకున్నామని తెలియచేసినారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్పీ వెంట ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు మరియు సిబ్బంది ఉన్నారు.



