గ్రామాల్లో ఉపాధికూలీలందరికి పనులు కల్పించాలి-ఎంపీపీ తాటికొండ

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిపనులు లేక కూలీలు ఇబ్బందులు పడు
తున్నారని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు వేగవంతం చేయాలని ఎంపీపీ తాటి కొండ శ్రీనివాస రావు అన్నారు. స్థానిక ఎంపీపీ చాంబర్లో ఉపాధికార్యాలయ సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి పనులు నత్తనడకగా జరుగుతున్నందున ఫీల్అసిస్టెంట్లను అప్రమత్తం చేసి కూలీలకు ఉపాదికల్పించా లన్నారు. ఉపాధి కార్యాలయ సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగి ఉపాధి పనుల వివరాలను గ్రామంలోని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుక వెళ్లి పనులు చేపట్టాలన్నారు. పనుల విషయంలో నాణ్యత పాటించాలన్నారు. ఉపాధి పనులకు వస్తామన్న ప్రతి వ్యక్తికి జాబ్ కార్డ్
అందజేయాలన్నారు. జాబ్ కార్డుల మంజూరు లో జాప్యంలేకుండా చూడాలన్నారు. ఉపాధిపనుల నిర్వహణలో తాళ్లూరు మండలం ప్రధమ స్థానంలో ఉండేలా కూలీలకు పనులు కల్పించాలన్నారు.
ఉపాధి సిబ్బంది కూడా బాధ్యతగా వ్యవహిస్తూ అందరూ సమన్వయంగా వుంటూ పనులు వేగవం తంగా జరిగేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుక రావాలని, వాటి పరిష్కారానికితన వంతు కృషి చేస్తాన్నారు. ఈసమావేశంలో మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి.ఓబుల్ రెడ్డి, ఏపీవో వెంకటేశ్వర్లు, టీఏలు, సీవోలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *