ఎట్టకేలకు నిత్యం వీధుల్లో తిరుగుతూ ప్రజలను గాయ
పరుస్తున్న వీధికుక్కల పట్టివేత కార్యక్రమంలో నాగంబొట్లపాలెం గ్రామంలో సోమ వారం చేపట్టారు. గ్రామంలో వందల సంఖ్యలో వీధికుక్కలు గుంపులు, గుంపులుగా తిరుగూ వున్నారు. రోడ్లపై తిరుగుతున్న చిన్నారులను, వృద్ధులను, ప్రజలను గాయ పరుస్తున్నాయి.దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చిమటా సుబ్బా రావు,పంచాయతీ కార్యదర్శి ఐ.వి.రమణారెడ్డిలు దృష్టికి ప్రజలు పలుమార్లు తీసుకువచ్చి విన్నవించుకోవడంతో …పంచాయతీ నిధులతో గ్రామంలో ప్రజల్ని గాయపరుస్తూ ఇబ్బందులు కల్గిస్తున్న వీధి కుక్కలను పట్టించి గ్రామానికి దూరంగా కొండల్లో వదిలిపెట్టారు. వీధికుక్కలను పట్టి తరలించటం పట్ల గ్రామప్రజల కుక్కల భాద తల్పినట్లయింది.
