పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే .ఇది పేదల ప్రభుత్వం. పాటిగడ్డలో సన్న బియ్యం భోజనం చేసిన మంత్రి సీతక్క

బేగంపేట మే 6 (జె ఎస్ డి ఎం న్యూస్)
పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, సన్న బియ్యం పంపిణీతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని ,రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ,గ్రామీణ నీటి సరఫరా ,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డలో ఏఐసీసీ సభ్యురాలు డాక్టర్ కోట నీలిమ, సనత్ నగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు విశాల్ సుధాములతో కలిసి సీతక్క పాటిగడ్డలోని సాలేహ బేగం నివాసంలో సన్నబియ్యం భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలులోకి తీసుకువస్తుందన్నారు. పేదలు సన్న బియ్యం పంపిణీతో ఎంతో సంతోషంతో ఉన్నారన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పేదల సంక్షేమం గురించి ఇంతలా పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విశాల్ సుధాం, బబ్లు ,చిరంజీవి, హనీఫ్ ఖాన్, కృష్ణ ,మనోజ్ ,నసీరుద్దీన్ (అడ్డు) ,తస్లీమ్ ,మాధవి, అల్తమాష్ ,జగదీష్ ,పర్వేజ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *