బేగంపేట మే 6 (జె ఎస్ డి ఎం న్యూస్)
సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ పాటి గడ్డలో సన్నబియ్యం భోజనం చేసేందుకు మంగళవారం వచ్చిన మంత్రి సీతక్క, ఏఐసీసీ సభ్యురాలు డాక్టర్ కోట నీలిమలు పాటిగడ్డలోని రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజ్ మంత్రి సీతక్క, కోట నీలిమలను శాలువాలతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహమ్మద్ ఫయాజ్ కు మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో ముజ్మీల్ షరీఫ్ తదితరులు ఉన్నారు.

