రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం.కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.

కంటోన్మెంట్ మే 6 (జే ఎస్ డి ఎం న్యూస్)
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 3 లోని అన్నానగర్ చౌరస్తా లోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ నగర్, సీతమ్మ పోచమ్మ టెంపుల్,బాలంరాయి మీదుగా లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ ర్యాలీలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్,టిపిసిసి సికింద్రాబాద్ జిల్లా పరిశీలకులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ,రాచమల్ల సిద్దేశ్వర్ లు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రతినిత్యం అవమానిస్తుందని, సాక్షాత్తూ నిండు పార్లమెంటులో అంబేద్కర్ గొప్పదనాన్ని తక్కువ చేసి చూపి దేశం దృష్టిలో వారి విలువను తగ్గించాలని చూసిందని, స్వయానా దేశ హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని తూలనాడారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు సామాన్యులు కూడా అందలం ఎక్కుతున్నారని, ఆయన కులం, మతం చూడలేదని, బిజెపి పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి ప్రయత్నించేదని, అందుకే దేశ ప్రజలు వారికి కర్రు కాల్చి వాత పెట్టారని, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ గతంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని కులాలు, మతాలు కలిసిమెలిసి జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అందుకే రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్లి బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను,అంబేద్కర్ పట్ల వారికి ఉన్న చిన్న చూపును దేశ ప్రజలకు వివరిస్తుందని, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *