బేగంపేట మే 6 (జె ఎస్ డి ఎం న్యూస్)
గరీబోళ్ల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీయే నని ఏఐసీసీ సభ్యురాలు ,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ అన్నారు. మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కోట నీలిమ పాల్గొన్నారు. ముందుగా ఆమె రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసి వారి ముఖాల్లో సంతోషాన్ని నింపిందన్నారు. పేదల గురించి గతంలో ఏ ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని, అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు తాము ఎంతో గర్వపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విశాల్ సుదాం, హాజీ తో చర్ ,సి రాజేందర్ మునీర్ ఖాన్, హనిఫ్ ఖాన్, నజీరుద్దీన్ (అడ్డు ),చిరంజీవి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.


