రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించండి. రైలు కార్యకలాపాలలో భద్రతను నిర్ధారించండి.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్…………………………..

హైదరాబాద్ మే 6 (జె ఎస్ డిఎం న్యూస్ తెలంగాణ ప్రధాన ప్రతినిధి) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద కచ్చితంగా భద్రత ప్రమాణాలను పాటించాలని
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులు ,సిబ్బందికి సూచించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో భద్రతపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతోపాటు మొత్తం 6 డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి.ఆర్.ఎమ్ లు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.జనరల్ మేనేజర్ రైలు కార్యకలాపాల భద్రతను చెబుతూ,రైలుకార్యకలాపాలలో సమన్వయాన్ని ఖచ్చితంగా పాటించాలని మరియు రైళ్లను నడుపుతున్నప్పుడు అన్ని భద్రతాజాగ్రత్తలుతీసుకోవాలని పేర్కొన్నారు. రైళ్లు మరియు రోడ్డు ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి జోన్‌ వ్యాప్తంగా లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని ఆయన సిబ్బంది,అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక భద్రతా చర్యలు, ట్రాక్ భద్రత, విద్యుత్ మరియు సిగ్నలింగ్ అంశాలు మొదలైన వాటిపై కూడా ఆయన సమీక్షించారు. మరియు పొగమంచు భద్రతా పరికరాల లభ్యతపై కూడా చర్చించారు. రైళ్లలో అగ్నిమాపక యంత్రాలను సరిగ్గా బిగించాలని మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులుఅనుసరించాల్సిన భద్రతా సూచనలు/మార్గదర్శక బోర్డులు/పోస్టర్‌లను ప్రదర్శించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అరుణ్ కుమార్ జైన్ ఆర్‌యుబిల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) వద్ద నీరు నిలిచే ప్రదేశాలను ప్రాధాన్యతపై గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో నీరు నిలువకుండా చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జనరల్ మేనేజర్ ట్రాక్‌ వెంట కంచె (ఫెన్సింగ్) పనుల పురోగతిపై చర్చిస్తూ అధికారులను పశువులు ట్రాక్‌లపైకి ప్రవేశించే సున్నిత ప్రదేశాలను గుర్తించి, పశువుల రాకుండా వెంటనే ఫెన్సింగ్ పనులను చేపట్టాలని ఆదేశించారు. పశువుల రన్‌ఓవర్‌లపై రైతులకు అవగాహన కల్పించాలని మరియు అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ట్రాక్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
తరువాత, జనరల్ మేనేజర్ అమృత్ భారత్ స్టేషన్ పధకం కింద అన్ని స్టేషన్లలో జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులను సమీక్షించాలని డివిజనల్ రైల్వేమేనేజర్లను ఆదేశించారు. ప్రయాణీకుల భద్రత చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్మాణ సమయంలో అన్ని భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని మరియు భద్రతా నిబంధనలను పాటించడంలో రాజీ పడకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెనల నిర్మాణ నాణ్యతపై దృష్టి పెట్టాలని మరియు అవసరమైనచో మెరుగైన భద్రత కోసం అవసరమైన డిజైన్ అంశాన్ని సమీక్షించాలని కూడా ఆయన ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *