రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం లో పిల్లలకు ఏ చికిత్స అయినా ఉచితంగా చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
బుదవారం జీజీహెచ్లోని జిల్లా బాల భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ పొర్టబుల్ ఎక్స్ రే యూనిట్ ను మరియు పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్న గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక టెస్ట్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక కలిగిన పిల్లల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక శస్త్ర చికిత్స విధానంను, అయ్యే ఖర్చును సంబంధిత వైద్యులు, జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం హ్యాండ్ పొర్టబుల్ ఎక్స్ రే యూనిట్ పని విధానం ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్. బి.ఎస్. కె) కింద జిల్లాలో గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక కలిగిన 30 మంది పిల్లలను గుర్తించడం జరిగిందని, వీరికి పిన్నమినేని సిద్ధార్ధ వైద్య కళాశాల స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ వారి సహకారంతో శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ఈ రోజు జిజిహెచ్ నందు టెస్ట్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ ను నిర్వహించడం జరిగిందన్నారు. వీరందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక్కో శస్త్రచికిత్సకు సుమారు 50 వేల రూపాయలు దాకా ఖర్చు అవుతుందని, ఒక్కొక్కరికి మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉండగా మొత్తం లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని, శస్త్ర చికిత్స అనంతరం స్పీచ్ ధెరిపి, టీత్ అలైన్మెంట్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే ఈ రోజు జిజిహెచ్ లో టిబి హ్యాండ్ పొర్టబుల్ ఎక్స్ రే యూనిట్ ను ప్రారంభించడం జరిగిందని, ఈ యూనిట్ నిర్వహణకు సంబంధించి సిబ్బందికి శిక్షణ కుడా ఇవ్వడం జరిగిందని, ఈ యూనిట్ ద్వారా రోజుకు సుమారు వంద ఎక్స్ రే లు తీయవచ్చునని కలెక్టర్ వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డెర్మటో సర్జరీ యూనిట్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, జిజిహెచ్ సుపరింటెండెంట్ డా జమున, క్లెఫ్ట్ ప్రాజెక్ట్ స్మైల్ ట్రైన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా శ్రీకాంత్, సిద్దార్ధ డెంటల్ కళాశాలకు చెందిన డా సుధా నాగేశ్వర రావు, జిజిహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *