వైభవో పేతంగా వాసవీ కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు ఉత్సవాలు

వాసవీ కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు సందర్బ
ముగా బుధవారం మండలంలోనితాళ్లూరు, తూర్పుగంగవరం వాసవీ కన్యకాపరమే శ్వరి ఆలయాలందు వాసవి కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆయా ఆలయాలందు వాసవీభక్తులు కన్యకాపరమేశ్వరికి ఇష్టమైన చీరెలు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గ్రామాల్లో భక్తులు ముందుగా వేకువ జామునే ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేకంగా అలంకరించిన వాసవీ కన్యకాపరమేశ్వరికి విశేషపూజలు నిర్వహించారు. అమ్మవారికి అష్టోత్తర నామపూ. జలు, గోత్రనామపూజలు, కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్యమహిళలుకన్యకామాతకు ప్రత్యేక పూజలు జరిపారు. కార్య క్రమాల్లో ఆయాగ్రామాలకు ఉత్సవాల నిర్వహకులు చందోలు ఆంజనేయులు, చందోలు రామారావు, చందోలు చందోలు ఆంజనేయులు, నేరెళ్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *