ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులలో ఆరుగురికి మహిళా పోలీసులుగా శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ నియామక పత్రాలు అందజేసారు.
ఏపీఎస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులలో జె. పంగులూరు మండలం, జాగర్లమూడి వారి పాలెం గ్రామానికి చెందిన బురగా కావ్యకి పెద్ద అంబడిపూడి సచివాలయం, వినుకొండ మండలానికి చెందిన ఉప్పలపాటి అనురాధ కి దేకనకొండ సచివాలయం, కొండేపి మండలం, కె.ఉప్పలపాడు గ్రామానికి చెందిన పూసపాటి అమృతకి పెద్ద కందులుగుంట సచివాలయం, సింగరాయకొండ మండలం, ఆవులవారి పాలెం చెందిన నామ పద్మావతికి ఉప్పలదిన్నె సచివాలయం, కొత్తపట్నం మండలానికి చెందిన కరేడు స్రవంతికి తాళ్లూరు 2 సచివాలయం, చీమకుర్తికి చెందిన గుంటూరి రమణకి పల్లామల్లి సచివాలయా లలో మహిళా పోలీసులుగా కారుణ్య నియామకాలు కింద ఖాళీ ఆధారంగా పోస్టింగ్లు కేటాయించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారికి మహిళా పోలీస్ ఉద్యోగ విధివిధానాల గురించి అవగాహన కల్పించి, గ్రామా/వార్డ్ సచివాలయాల పరిధిలో జరిగే శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణ, అసాంఘిక/చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మరియు ఇతర విషయాలకు సంబంధించి సమాచారం సేకరణలో ప్రముఖ పాత్ర పోషించాలని, మెరుగైన రీతిలో ప్రజలకు సేవలను కొనసాగించడానికి అంకితభావంతో కష్టపడి పనిచేయాలని, పాఠశాలలు/కళాశాలలోని విద్యార్థినిలకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు మరియు ప్రజలకు రోడ్డు భద్రత నియమాలు గురించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పోలీసులకు వారి వంతు సహాయ సహకారాలు అందిచాలని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సూచించారు.
కార్యక్రమంలో డిపిఓ ఏవో రామ్మోహన్ రావు మరియు సిబ్బంది యు.రామకృష్ణ పాల్గొన్నారు.
