మజిల్స్ రూబెల్లా నివారణకు తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో ప్రత్యేక ప్రణాళిక ( డ్రైవ్ ) రూపొందించినట్లు ప్రాధమిక కేంద్రం వైద్యాధికారి మౌనిక, వైద్యులు శ్రీకాంత్ తెలిపారు. మజిల్స్ రూబెల్లా వ్యాధి వచ్చిన పిల్లలు జ్వరంతో పాటు నిమోనియా వ్యాధి రావటంతో పాటు ఒంటి పై దద్దుర్లు వస్తాయని పిల్లలకు శారీరక పెరుగుదల తగ్గుతుందని తెలిపారు. పది నెలల చిన్నారుల నుండి 18 నెలల వరకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మొదట విడుతగా ఈనెల 26 నుండి 31 వరకు, రెండవ విడుత జూన్ 23 నుండి 26 వరకు, జులై 21 నుండి 26 వరకు మూడు విడుతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రం పరధిలోని నచివాలయాలో, గ్రామాలలో చిన్నారుల తల్లిదండ్రులు విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
రూబెల్లా వ్యాక్సిన్ కు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు కార్యాచరణ
21
May