మేనెలలో రోహిణి కార్తీలో విపరీతమైన ఎండలు ఉండాల్సిన సమంయలో అందుకు బిన్నంగా వాతావరణం ఉందని విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని భూ గర్భ జలాలను పెంపొందించుకోవాలని చెప్పారు. పచ్చి రొట్ట విత్తనాలు చల్లి పశువుల మేతగా ఉపయోగించుకోవాలని కోరారు. 40 రోజుల వరకు ఎపుగా పెరిగిన తర్వాత భూమిలో బాగా కలియ దున్నాలని చెప్పారు.
తాళ్లూరులో బుధవారం సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. గత మూడు రోజుల నుండి ప్రతిరోజు తాళ్లూరులో వర్షపాతం నమోదు అవుతున్నది. 40.6 మి.మీల వర్షపాతం నమోదు అయినది.
