తాళ్లూరులో బుధవారం విద్యుత్ టవర్స్ కు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసే క్రమంలోమధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినది. గత ఆదివారం కూడ విద్యుత్ టవర్స్ కు తీగలు ఏర్పాటు చేసే క్రమంలో ఫైబర్ నెట్ తీగలు మొత్తం తెగిపోయాయి. దీంతో గత నాలుగు రోజులుగా ఫైబర్ నెట్ సేవలు ఆగిపోయాయి. తాళ్లూరులో బుధవారం కొంత మేర ఫైబర్ నెట్ సేవలు అందించినప్పటికి పూర్తి స్థాయిలో వినియోగదారులకు సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫైబర్ నెట్‌కు ఆదరణ పెరుగుతున్న సమయంలో ఇటువంటి అంతరాల వలన సేవలు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా బి ఎన్ ఎన్ ఎల్ అధికారులు స్పందించి త్వరితగతిన స్పందించి ఫైబర్ నెట్ సేవలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.
