ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ల కు సూచించారు.
విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి బుధవారం రెవెన్యూ అంశాలు, రీ సర్వే, నివేశన స్థలాల వెరిఫికేషన్ ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ… ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటిపట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ…జిల్లా లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటి పట్టాల వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌసే భాషా, తదితరులు పాల్గొన్నారు.


