ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక – రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏనుగులను స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ -పవన్ కళ్యాణ్ కి లాంఛనంగా కుంకీ ఏనుగులు అందజేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ , అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే లు -గజ పూజ చేసి ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్.

బెంగుళూరు, మే 21( జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది. బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఉప ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ , అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే లు కుంకీ ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖామాత్యులు పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందించారు. కుంకీ ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్స్ లు, వాటి సంరక్షణకు సంబంధించిన విధివిధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పవన్ కళ్యాణ్ కి అందజేశారు. శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా, పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యణ్ ఆహ్వానం పలికారు. ఈ నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు. దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కి అప్పగించారు. కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకీ ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని శl పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev ప్రధాని మోదీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం.బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి.రాబోయే 30-40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా అభివృద్ధి. ప్రయాణికులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో సాగుతున్న పునరాభివృద్ధి పనులు.తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్ల ప్రారంభంపూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనున్న బేగంపేట రైల్వేస్టేషన్.
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *