ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపధ్యంలో రైతులు కేవలం లైనెన్స్ కలిగిన డీలర్ల వద్దను విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు పొందాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు.
తూర్పుగంగవరంలో బాలాజీ సీడ్స్ను ఆయన గురువారం పరిశీలించారు. విత్తన దుకాణాదారులు కేవలం ధృవీకరించిన విత్తనాలనే అమ్మాలని కోరారు. రైతులు తాము తీసుకున్న రసీదులను సీజన్ పూర్తి అయ్యే వరకు తమ వద్దను ఉంచుకోవాలని చెప్పారు. గ్రామాలలో అనుమతులు లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్మినట్లయితే విత్తన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అలా చేసినట్లయితే సమాచారం ఇవ్వాలని కోరారు.
