నేటి యువత ఉద్యోగం అందుకునే స్థాయి నుండి ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

నేటి యువత ఉద్యోగం అందుకునే స్థాయి నుండి ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కళాశాల లో శనివారం మెప్మా మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలకు ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ, మెప్మా సభ్యులకు ప్రత్యేకంగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగం అందుకునే స్థాయి నుండి ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలని సూచించారు. యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందన్నారు. ఆ దిశగా ఉద్యోగం విషయంలో కూడా యువతీ, యువకులు ఒక లక్ష్యం, సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పం, లక్ష్యం ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంపొందించుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు.

ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ….మెప్మా ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాలో ప్లేస్మెంట్ రాకపోతే నిరాశ చెందక మరింత పట్టుదలతో సంకల్పంతో కృషి చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని, కష్టపడితే ఫలితం ఉంటుంది అనే విషయాన్ని యువత కచ్చితంగా గుర్తించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, మెప్మా పిడి శ్రీహరి, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ అధికారి రవి తేజ, నాగార్జున డిగ్రి కళాశాల చైర్మన్ రాంప్రసాద్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాన్ని పెంపొందిచుకుంటూ, వచ్చిన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు సూచించారు.
ఈ జాబ్ మేళా లో దాదాపు 40 ప్రైవేట్ కంపెనీలు పాల్గొనగా, 1200 నిరుద్యోగ యువత తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది.
అనంతరం మెప్మా ఆధ్వర్యంలో 10 ఎలెక్ట్రికల్ బైక్ లను, 10 ఎలెక్ట్రికల్ ఆటోలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత తో కలసి పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో సెట్నల్ సిఈఓ శ్రీమన్నారాయణ, జిల్లా అర్బన్ సమాఖ్య ప్రతినిధి భారతి, స్వయం సహాయక సభ్యులు, వారి పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *