బేగంపేట మే 25(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట్ డివిజన్ మోతి లాల్ నెహ్రు నగర్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుదాం , కాలనీ పాలకవర్గం ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించారు.వర్షానికి చెట్లు కొమ్మలు విరిగి కాలనీలోని ఇంకుడు గుంతల లో పేరుకు పోవడం తో వాటిని ఆదివారం ఉదయం తొలగింపజేశారు. సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, ఏ ఐ ఐ సి సభ్యురాలు డాక్టర్ కోట నీలిమఆదేశాలమేరకు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విశాల్ సుదం ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంజయ్ చల్లా, కార్యదర్శి నిరావ్
షా, కమిటీ సభ్యులు జయశ్రీ దుంగ్, సందీప్ రావు, అమిత్ రావు, తదితరులు కాలనీ లో పారిశుధ్యం పనులను చేశారు.
చెత్త ను తొలగించి, వర్షపు నీటి అడ్డంకిని తొలగింపజేశారు. కాలనీలో వివిధ ప్రాంతాల్లో పేరుకు పోయిన చెత్త కుప్పలను తొలగించారు.
ఇదే సమయంలో విద్యుత్ దీపాలు వెలగని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
