జిల్లా జైలులో ప్రత్యేక యోగా అభ్యాస శిబిరం ఏర్పాటు

యోగాంధ్ర – 2025 ను పురస్కరించుకొని నెల రోజులు రాష్ట్రంలో యోగా ప్రచార కార్య క్రమాలు నిర్వహణలో బాగంగా జిల్లా జైలు, ఒంగోలులో ఖైదీల మానసిక శాంతి, శారీరక ఆరోగ్య అభివృద్ధి కోసం ప్రత్యేక యోగా అభ్యాస శిబిరాన్ని ఏర్పాటు
చేశారు. ఈ కార్యక్రమంలో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు, ధ్యాన పద్ధతులను ఆచరించు చున్నారు.ఈ యోగా శిక్షణను ప్రముఖ యోగా గురువులు పతంజలి శ్రీనివాస్ శిష్య బృందం తాతా ప్రసాద్, కిరణ్ కుమార్, లక్ష్మి లావణ్య మరియు విజయలక్ష్మి నేతృత్వంలో నిర్వహించగా, ఖైదీలలో నిచ్చలమైన ఆలోచనలకు, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వారు తెలిపారు. యోగా ద్వారా మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ వరుణా రెడ్డి మాట్లాడుతూ… “ఖైదీల సంస్కరణలో భాగంగా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను రూపొందించనున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైదీలు, జైలు సిబ్బంది, అధికారులు మరియు యోగా శిక్షకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *