సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశ లింగం పంతులు మహిళా
జనోద్ధారకుడని పలువురు వక్తలు కొనియాడారు. ఎంపీడీఓ కార్యాలయం సమావేశపు మందిరంలో మంగళవారం కందుకూరి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సాంఘిక రుగ్మ తలు రూపు మాపారని, మహిళా విద్యను ప్రొత్సహించారని, వితంతు వివాహాల కోసం ఎన్నో కలుపు మొక్కలను వేరి పారవేరేసిన గొప్ప సైనికుడని కొనియాడారు. కందుకూరిని స్పూర్తిగా తీసుకుని మహిళల హక్కుల కోసం, రక్షణ కోసం ఉద్యమించాలని టిడిపి ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి శాగం కొండా రెడ్డి పిలుపు నిచ్చారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము నత్యం, టిడిపి ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు సుబ్బా రావు, స్వామి దాన్, బ్రహ్మా రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
