యోగా ప్రతి రోజు చేసినట్లయితే తో జీవన విధానం మరింత ఉత్సాహంగా సాగుతుందని ఎంపీడీఓ దార హనుమంత రావు అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం మండల స్థాయిలో యోగాంధ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీడీఓ, యోగ అభ్యాస నిపుణులు పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. పలు యోగాసనాలు అభ్యసనం చేయించారు.
