సేంద్రీయ ఎరువులు వాడుకుని భూమిని సంరక్షించుకోవాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండలంలోని విఠలాపురం గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడారు. విచక్షణా రహితంగా రసాయనాలు వాడటం వలన భూమి నిసారం అవుతుందని చెప్పారు. మండలంలో 30వేల పశువులు, 42 వేలు జీవాలు ఉన్నాయని వాటి ద్వారా 60వేల మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఎరువు అందుబాటులోనికి వస్తుందని ఉపయోగించుకోవాలని కోరారు. విఏఏ కె అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సేంద్రీయ ఎరువులతో భూమిని సంరక్షించుకోవాలి
27
May