యోగాతో మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని ఓత్తిడి జయించవచ్చని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో బాగంగా శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద యోగాసనాల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తాను కూడ యోగ శిక్షణ పొందానని అందులో అనుభూతి పొందకలిగితే జీవితాంతం యోగాను వదిలి పెట్టమని అన్నారు. మానవ జీవితం యోగాతో ఒక క్రమశిక్షణకు అలవాటు అవుతుందని చెప్పారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, తహసీల్దార్ సంజీవ రావు, హెూమియో పతి వైద్యురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు.

