యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్, ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్, ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,జిల్లా కలెక్టర్లకు సూచించారు.
శుక్రవారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సి.ఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశమై యోగాంధ్ర -2025 క్యాంపెయిన్, పీఎం సూర్య ఘర్ అమలు, వివిధ ప్రభుత్వ పథకాల సేవల పట్ల ప్రజా స్పందనలు వంటి అంశాల పై సమీక్షించి దిశానిర్దేశం చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని 2. 20 కోట్ల మంది ప్రజలను యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేటట్లు చర్యలు తీసుకోవాలని, జూన్, 21వ తేదీన ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో లక్ష ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగాంధ్ర పోటీలు నిర్వహించాలన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం అనంతరం కూడా యోగాను ప్రతీ ఒక్కరూ కొనసాగించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. నిర్దేశించిన షెడ్యుల్ ప్రకారం యోగాంధ్ర -2025 క్యాంపెయిన్ విజయవంతం చేయడంతో పాటు యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్, ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే యోగ పై ర్యాలీలు, కాంపిటీషన్స్ నిర్వహిస్తూ యోగ పై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి జిల్లా కు కేటాయించిన పీఎం సూర్య ఘర్ లక్ష్యాలని పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద చుపాలన్నారు. విద్యుత్, ఇసుక, ఎన్టిఆర్ వైద్య సేవలు, దేవాలయాలలో మౌలిక సదుపాయాలు, మునిసిపల్ సేవలపై వచ్చిన ప్రజా స్పందనలపై సిఎస్ సమీక్షిస్తూ, ప్రభుత్వ ప్రధకాల అమలు తీరుపై వచ్చే ప్రజా స్పందనలపై తేలికగా తీసుకోకుండా జిల్లా కలెక్టర్లు సమీక్ష చేసి నిరంతరం మానిటరింగ్ చేయాలన్నారు.
ఒంగోలు కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, హౌసింగ్, డిఆర్డిఎ, మెప్మా పిడీలు శ్రీనివాస ప్రసాద్, నారాయణ, శ్రీహరి, విద్యుత్ శాఖ ఎస్.ఈ వెంకటేశ్వర రావు, సెట్నల్ సిఈఓ శ్రీమన్నారాయణ, డిఎస్ డిఓ రాజేశ్వరి, డివ్యాంగుల శాఖ ఏడి అర్చన తదితరులు పాల్గొన్నారు.
అంతకముందు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లలో జరుగుచున్న యోగాంధ్ర -2025 క్యాంపెయిన్, పీఎం సూర్య ఘర్ లక్ష్యాల పురోగతిపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *