విధుల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరువలేనిదని జిల్లా ఎస్పీ
ఏఆర్ దామోదర్ అన్నారు.
పోలీస్ శాఖలో సుధీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి శనివారం పదవి విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ యన్.సురేష్ బాబు ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నఏ.వెంకటేశ్వరరావు, వివి భాస్కర్ రెడ్డి, కె.వెంకట రంగారావు , కె. వి.రంగారెడ్డి ల సర్వీస్ లను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
మరియు పోలీస్ అధికారులు శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, జ్ఞాపికలను అందచేసి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ… పోలీస్ శాఖకు సుధీర్ఘకాలం పాటు నిబద్ధత, అంకితభావంతో అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమని, విధి నిర్వహణలో కేటాయించిన అన్ని విధులు సమర్థవంతంగా పనిచేసి మంచి అధికారులుగా పేరు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో చూపిన నైపుణ్యం, పట్టుదల పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. ఆయన సర్వీసులో అనేక క్లిష్టమైన కేసులు ఎదురైనప్పటికీ, మనోధైర్యంతో, నాయకత్వ నైపుణ్యంతో వాటిని విజయవంతంగా పరిష్కరించారని తెలిపారు. రిటైర్మెంట్ అనేది సేవకు ముగింపు కాదన్నారు. సాధారణ బందోబస్తు నుండి శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో ఏ. ఆర్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఎటువంటి రిమార్కులు లేకుండా 35-43 సం.లు పోలీసుశాఖకు సేవలందించడం అభినందనీయమన్నారు. వారి యొక్క సర్వీస్ లో రివార్డ్స్, సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, గుడ్ సర్వీస్ పొందియున్నారని అన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు, కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించి, వారి పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్ది, వారు ఉన్నత స్థానంలో నిలిచేలా చేసారన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జీవితాన్ని ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, వచ్చిన డబ్బులను జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవాలన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని భవిష్యత్తులో ఎటువంటి సహకారం అవసరమైనా పోలీసుశాఖ తప్పకుండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, వై.పాలెం సీఐ ప్రభాకర్, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

