రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని టిడిపి దర్శినియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరు వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో శనివారం రైతులకు నబ్సిడీపై మంజూరు అయిన వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ … రైతు మిషన్ ద్వారా ప్రభుత్వం రైతులకు నబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతులను నిలువునా ముంచారని విమర్శించారు. మన ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందని. సీఎం చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల కష్టాలు చూసి కేంద్రంతో మాట్లాడారని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడు, మన జిల్లా మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రజా ప్రతినిధులు కలిసి కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా గిట్టుబాటు ధరకు పొగాకు కోనాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ముందస్తు వర్షాల వలన రాబోవు ఖరీఫ్ లో ప్రభుత్వం అందిస్తున్న నబ్సిడీ యంత్రాలతో మరింత లాభసాటిగా వ్యవసాయం చేసేందుకు రైతున్నలు సంతోషంగా సిద్ధం అవుత్నుట్లు చెప్పారు. అనంతరం రూ.8.30 లక్షల విలువైన 18 సబ్సిడీ యంత్రాలు స్పేయర్లు, గొర్రులు, రోటా వేటర్లను, భూ పరీక్షా పత్రాలను రైతులకు అందజేసారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, దర్శి ఎడీఏ బాలాజీ నాయక్, ఎవో ప్రసాద రావు, తాళ్లూరు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, శాగం కొండారెడ్డి, షేక్ పెదకాలేషా వలి (బడే), పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, గ్రామ యూత్ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కొత్త పాలెం పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, నీటి కమిటి వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, గొంది రమణా రెడ్డి (నమర), పిన్నిక రమేష్ తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, రామయ్య, ఎఈఓ రాజ నుందరి, విఏఏలు తదితరులు పాల్గొన్నారు.



