నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్ కు ఎంపికైన తాళ్లూరు మండల విద్యార్థులు

తాళ్లూరు మండలంలోని లక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8 వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినీలు యం.స్నేహ , టి. శిరీష, యం.ఇందిరా, బి మాధురి ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్)కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. అనంతనాభ రావు తెలిపారు. ఈ స్కాలర్షిప్ కు విద్యార్థినీలకు నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనం అందించనున్నదని పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు బెల్లం. శ్రీనివాసరావు అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థునీలను ప్రధానోపాధ్యాయుడు , తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు వారిని అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *