విధి పట్ల నిబద్ధత ఉన్నవారిని సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని జిల్లా ఎస్పీఎస్పీ ఏ.ఆర్ దామోదర్ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో విశిష్ట సేవలు అందించిన అడిషనల్ ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న ఎం ఎస్ ఎస్ అశోక్ బాబు ఎఆర్ నాన్ క్యాడర్ ఎస్పీ గా పదోన్నతి పొంది సాధారణ బదిలీలులో భాగంగా మంగళగిరి పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (పిటిఓ) కి బదిలీ అవుతున్న ఏ.ఆర్ ఎస్పీ అశోక్ బాబు కి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీసు అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఏ.ఆర్ ఎస్పీ కి జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ శాలువా కప్పి సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏఆర్ ఎస్పీ పరిపాలన అంశాలపై అన్ని విధాలుగా తనకు సహాయ సహకారాలు అందించారన్నారు. జిల్లాలో 3 సంవత్సరాల 7 మాసాలు విధులు నిర్వహించారని, ఎఆర్ఎస్సై స్థాయి నుండి ఎస్పీ హోదా వరకు ఎదగడం అనేది గొప్ప విజయమని ప్రశంసించారు. జిల్లా పోలీస్ శాఖలో సిబ్బందికి యోగా, కరాటే, ధ్యానం, పలు క్రీడలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించటంలో ముందు ఉన్నారన్నారు. ఎలక్షన్ సమయంలో, బందోబస్తు, నేర నియంత్రణలో అందించిన సేవలు అభినందనీయమని, విధి నిర్వహణలో ఎంతో అంకిత భావంతో పని చేశారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టబోయే ప్రదేశంలో మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని, వృత్తి జీవితంలో మరిన్ని పదోన్నతులు, పేరు ప్రఖ్యాతలు పొందాలని, ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
ఏఆర్ ఎస్పీ మాట్లాడుతూ… ఈ పోలీస్ కుటుంబం నాకు మరిచిపోలేని అనుభవాలు అందించిందని, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ చూపిన మద్దతు, ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుందన్నారు.
కార్యక్రమంలో మహిళ డిఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, మహిళా పియస్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు,ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ, సిసియస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎఆర్ఎస్సైలు,సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

