భద్రతకు అత్యంత ప్రాముఖ్యం అది ఎల్లవేళలా బలంగా ఉండాలి.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్.

సికింద్రాబాద్ జూన్ 9 (జే ఎస్ డి ఎం న్యూస్) ;
దక్షిణ మధ్య రైల్వే లో భద్రత కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్అన్నారు.సోమవారం సికింద్రాబాద్‌ రైల్ నిలయంలో రైలు భద్రత మరియు సమయపాలనపై దృష్టి సారించి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశంలో
అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్ , వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతోపాటు మొత్తం 6 డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైల్వే కార్యకలాపాల్లో భద్రత అత్యంత ముఖ్యమైనదని పునరుద్ఘాటిస్తూ, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మరియు సత్వర పద్ధతులను నివారించడంపై దృష్టి పెట్టాలని తెలిపారు . సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మరియు భద్రతా నిబంధనలను కఠినంగా పాటించాలని ఆయన సూచించారు. రైల్వే సిబ్బందిలో భద్రతా అవగాహనను మరింత బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి కౌన్సెలింగ్‌ను ఇవ్వాలని ఆదేశించారు. ట్రాక్ భద్రతను పెంచడానికి అన్ని ఆర్.యు.బి ల వద్ద కనీసం రెండేసి హైట్ గేజ్‌లను ఏర్పాటు చేయాలని సూచిస్తూ రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్.యు.బి లు ) మరియు లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు. ఇటీవలి జరిగిన పశువుల రన్ ఓవర్ కేసులకు సంబందించిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, పశువుల రన్ ఓవర్ వలన రైలు కదలికలో అంతరాయాలను నివారించడానికి తీసుకోవలసిన చర్యల అవసరాన్ని వివరించారు.
ట్రాక్ వెంట ఫెన్సింగ్ ఏర్పాటు పనిపురోగతిపై సమీక్షిస్తూ కీలక స్థానాలలో వాటి ఏర్పాటు పై కూడా సమీక్షించారు. దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనలో భాగంగా, అరుణ్ కుమార్ జైన్ ‘ఆల్ఫా ఇన్‌స్పెక్టర్’ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎ.ఐ) మరియు జి.పి.ఎస్ టెక్నాలజీలను ఉపయోగించే వెబ్ మరియు మొబైల్ ప్లాట్‌ఫామ్ ఆప్. చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ల సామర్థ్యాన్ని పెంచడానికిరూపొందించబడిన ఈ అప్లికేషన్ , కదలికలను తెలుసుకోవడం మరియు రికార్డ్ కీపింగ్‌ను ఆటోమైజ్ చేస్తూ మాన్యువల్ పనిభారాన్ని తగ్గిస్తుంది.
ఇది లోకో పైలట్ (ఎల్.పి.) మరియు అసిస్టెంట్ లోకో పైలట్ (ఎ.ఎల్.పి. ) కార్యాచరణ డేటాకు రియల్-టైమ్ యాక్సెస్‌ను అందిస్తుంది, డివిజనల్ మరియు జోనల్ స్థాయిలో అసాధారణ స్థితు తులపై త్వరితగతిన స్పందించేందుకు అనుమతిస్తుందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *