తాళ్లూరు మండల కేంద్రం లోని శ్రీ ఏ బి సి హై స్కూల్ విద్యా ర్థులు పదో తరగతి ఫ లితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిభ అవార్డులు పొందారు. ఐడమకంటి స్నేహితా రెడ్డి (587), మార్కులలతో మండలంలో ప్రతిభ చాటగా, ఎస్సీ విభాగంలో ఏ మైఖేల్ (572) మార్కులను సాధించి ప్రతిభ అవార్డులు పొందారు. ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో సోమవారం జరిగిన ప్రతిభ అవార్డులు మహోత్సవంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బి.ఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత , ఏపీ లైవ్ స్టాక్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ లు అవార్డులను విద్యార్థులకు అందజేసారు. ఈ అవార్డుతోపాటు 20వేల రూపాయల నగదు ప్రశంసా పత్రంతో పాటు మెడల్ ను అందజేసారు. తమ పాఠశాల విద్యార్థులకి ప్రతిభా అవార్డులు పొందడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ టి. శ్రీనివాసరెడ్డి , ప్రిన్సిపల్ కే వెంకటేశ్వరరావు డైరెక్టర్ కె. కాలేష బాబు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం జరిగింది.



