రైతుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగివినియోగించుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం నోడల్ అధికారి కె సంధ్యా రాణి అన్నారు. మండలంలోని బొద్దికూరపాడులో మంగళవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కె సంధ్యారాణి మాట్లాడుతూ భూసార పరీక్షలు, వాటి యాజమాన్యం, పచ్చి రొట్ట ఎరువులు ఉపయోగం, ఖరీఫ్ సాగుకు అనువైన కంది పంటలోని రకాలు, ఎల్ ఆర్ జి -52, బిఎం ఎన్ ఆర్ 736, టిఆరిజి -59 మరియు విత్తన శుద్ధి, చీడ పీడల నివారణ గురించి వివరించారు. బాపట్ల వ్యవసాయక్షేత్ర శాస్త్ర వెత్త డాక్టర్ ఎం బాల మురళీ ధర్ నాయక్ మాట్లాడుతూ నజ్జ పంట సాగు, వరిలో వచ్చే చీడ పీడ గురించి వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఉద్యానవన శాఖాధికారి వెంకన్న బాబు, డిఆర్పీ ఎవో శేషమ్మ తదితరులు మాట్లాడుతూ రైతులకు పలు పంటల సాగు ఇచ్చే రాయితీలు, యాప్ల గురించి వివరించారు. డ్రోన్ల పనితీరు గురించి వివరించారు. ఉపసర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, ఆత్మ ఎటీఎం రామి రెడ్డి, నీటి సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కోటి రెడ్డి, నాగి రెడ్డి, విఆర్ చిన క్రిష్ణయ్య, విఏఏ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.

