ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలి – సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి

ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియను పటిష్టంగా చేపట్టడం తో పాటు ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి జిల్లా కలెక్టర్ల కు సూచించారు.
మంగళవారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్ గా అన్నీ జిల్లాల కలెక్టర్ల తో సమావేశమై పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తుల పెండేన్సి, ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియతదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ… జిల్లాల్లో పిజిఆర్ఎస్ లో రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా దరఖాస్తులను, సమస్యలను పెండింగ్ లో లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటిపట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పై ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వర కుమార్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస రావు, ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *