ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాబ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ -2025 కార్యక్రమం నిర్వహణ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా

ఇంటర్మీడియట్ అయినతర్వాత దేశ విదేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సు కు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి తదితర విషయాలను విద్యార్ధులు తెలుసుకునేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
గురువారం ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారి ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ -2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా ముఖ్య అతిధిగా పాల్గొని ఈ సందర్భంగా వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రకాశం జిల్లాలో విద్యార్ధులకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారిని అభినందిస్తూ, ఇలాంటి విద్యా కోర్సుల అవగాహన కార్యక్రమాలు విద్యార్ధులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత దేశ విదేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సు కు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి తదితర విషయాలను విద్యార్ధులు తెలుసుకునేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్ధులు అకడమిక్ విద్య తో పాటు కమ్యునికేషన్ స్కిల్ పెంపొందించుకొని జీవితంలో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ రోజు ఏర్పాటుచేసిన ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ లో అనేక విశ్వవిద్యాలయాల ప్రతినిధులు వచ్చి ఆయా విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సుల వివరాలు, ఉద్యోగ అవకాశాలు తదితర వివరాలతో స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్ధులు కూడా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డా. ఎస్.కె న్యామత్, క్యిస్ కళాశాల, కెఎల్ విశ్వవిద్యాలయం, వివిఐటి, విజ్ఞాన్ యూనివర్సిటీ, తదితర యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *