నేడు ప్రజలు గెలిచి, ప్రజాస్వామ్యం గెలిచి నేటికి ఏడాది పూర్తి – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

విధ్వంసం నుండి వికాసం వైపు ఆంధ్ర రాష్ట్రం అడుగులు వేస్తున్న శుభఘడియలని,అరాచక విధ్వంస పాలనకు స్వస్తి చెప్పి ప్రజా జన రంజక కూటమి పాలన అందించి ఏడాది పూర్తయిన ఒక పండుగ రోజు ఇది అని .. మన కూటమి ఏర్పడి ఏడాది కాలంలో ఇచ్చిన హామీలలో ఏడాదిలోనే 75% హామీలను పూర్తిచేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
ఏడాది కూటమి పాలన పూర్తయిన సందర్భంగా గురువారం ముండ్లమూరు మండలం లో జరిగిన పండుగ సందర్భంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజల ఉద్దేశించి మాట్లాడారు. మన మంచి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఆమె వివరించారు. ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ సహకారంతో మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు , ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు అహర్నిశలు చేస్తున్న కృషి చూస్తున్నారని అన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజా జనరంజక పాలనను అందిస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి, ఏడాది వైసీపీ పాలనలో విధ్వంస వినాశకర పాలనను అందించి కేవలం ఇచ్చిన హామీలలో 10 శాతం మాత్రమే పూర్తిచేసి దోచుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు సంక్షోభంలోనే సంక్షేమాన్ని ముందుకు తీసుకు వెళుతూ, అభివృద్ధిని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నేడు తల్లికి వందనంతో తల్లుల కళ్ళల్లో ఆనందం, ఇంట్లో ప్రతి చదువుకునే బిడ్డకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున నగదు జమ చేసే కార్యక్రమం, క్రమం తప్పకుండా పెంచిన పెన్షన్ ను ఒకటవ తేదీన అందించడం, ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు, దీపం -2 పథకం అమలు, త్వరలో ఉచిత బస్ సర్వీసు ను మహిళలకు కానుకగా ఇస్తున్నారని తెలిపారు. గత వైసిపి విధ్వంసానికి నిదర్శంగా మూసివేసిన అన్న క్యాంటీన్ లను తిరిగి ప్రారంభించడం, మన దర్శి లో కూడా త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోబోతున్నా అని, అదేవిధంగా దేవాలయాలలో అన్నదానం…ఇలా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ వలె మన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. గత వైసిపి నిరుద్యోగులను మోసం చేసింది, మన ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం. పరిశ్రమలను తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి రప్పించేందుకు ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం బెదిరింపులతో దౌర్జన్యాలతో అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయాయి. తిరిగి పరిశ్రమల రాక కోసం మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ గ్రామాలలో రోడ్ల అభివృద్ధి, పట్టణాలలో రోడ్ల అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని తెలిపారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధాని ప్రాంతం లో విధ్వంసం సృష్టించిన వైసిపి నేడు ఏడాది కూటమిపాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అల్లర్లు సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్ల సాక్షి పత్రిక లో తల్లుల రాజధాని, దేవతల రాజధాని అమరావతిపై విషం చిమ్మిస్తూ మహిళల పట్ల కించపరిచే వేశ్యలనే పదాన్ని వాడి, ఇలా మహిళల పట్ల సాక్షి మీడియా చేసిన దుష్ప్రచారాన్ని మహిళా లోకం తిప్పి కొడుతుందని చెప్పారు . పొదిలిలో మహిళా ఆగ్రహానికి జగన్ అండ్ పేటీఎం బ్యాచ్ దాడులకు దిగడం చూసామని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మన తెలుగుదేశం మహిళలను గౌరవించే పార్టీ, సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళుతూ ఏడాది కూటమి పాలనలో జన రంజక పాలన నడిచిందని అన్నారు. అదే స్ఫూర్తితో మన దర్శి నియోజకవర్గంలో కూడా 100 కోట్లకు పైగా నిలిచి పోయిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతూ దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు నేను చేస్తున్న నిరంతర కృషికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేద్దాం, విధ్వంసం వినాశకర రాజకీయ వైసీపీ కుట్రలను తిప్పి కొడదామని, అభివృద్ధి వైపు పరుగులు తీద్దామని అన్నారు.

ముందుగా కూటమి ప్రభుత్వ ఏడాది పండుగ ర్యాలీ ముండ్లమూరు మండలం శంకరరాపురం లో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కార్యకర్తల కేరింతల మధ్య ప్రారంభమైంది. ర్యాలీలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు స్కూటీపై ముందుండి ర్యాలీని నడిపించారు. ద్విచక్ర వాహనాలపై తెలుగుదేశం శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున శంకరాపురం నుండి ప్రారంభమై ముండ్లమూరు టౌన్ ఎన్టీఆర్ విగ్రహాం వరకు జరిగింది. ర్యాలీలో ఊరూరా అపూర్వ స్వాగతం లభించింది. కూటమి ఏడాది పాలనకు జేజేలు అంటూ నినాదాలు చేశారు. గ్రామ గ్రామంలో కేకులు కట్ చేస్తూ ఉత్సాహ భరితంగా కూటమి నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముడ్లమూరు పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దొనకొండ, కురిచేడు, దర్శి ముండ్లమూరు, తాళ్ళురు మండలా పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, పిడతల నేమిలయ్య, మరెళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *