హైదరాబాద్ జూన్ 13 (జె ఎస్ డి ఎం న్యూస్) :
బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది కడుపు నొప్పితో చికిత్సకు వచ్చిన గర్భిణి మృతి చెందిన సంఘటన కేర్ హాస్పిటల్లో జరిగింది.కానిస్టేబుల్ గా పనిచేస్తున్న విమలా కుమారి (33) ఏడు నెలల గర్భిణి. కడుపునొప్పితోబాధపడుతున్న ఈమెను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న భర్త ఈనెల 10న బంజర హిల్స్ రోడ్ నెంబర్ 1 లోని కే హాస్పిటల్ లో చేర్పించాడు. అల్ట్రా సౌండ్ స్కాన్ చేసిన హాస్పిటల్ గైనకాలజిస్ట్ రజిని ఇద్దరు కవల పిల్లల్లో ఓ పాప చనిపోయిందని చెప్పారు. ఆరోగ్య భద్రత నుంచి అప్రూవల్ రాకపోవడంతో మూడు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు చెల్లించారు. బుధవారం ఉదయం విమల కుమారికి శాస్త్ర చికిత్స నిర్వహించి గర్భంలో కవల పిల్లల్లో మృతి చెందిన ఒక పాపను, ప్రాణాలతో ఉన్న ఒక బాబును బయటకు తీశారు. అయితే ప్రాణాలతో ఉన్న బాబు పరిస్థితి కూడా సీరియస్ గా ఉండడంతో ఐసీయూలో ఉంచారు. మృతి చెందిన పాప అంత్యక్రియలనునిర్వహిస్తుండగానే హాస్పిటల్ సిబ్బంది మరోసారి ఫోన్ చేసి మీ భార్య పరిస్థితి బాగోలేదని వెంటనే రావాలని సూచించారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో విమల కుమారి మృతి చెందిందని కుటుంబ సభ్యులకు హాస్పటల్ యాజమాన్యం తెలిపారు. దీంతో షాక్ గురైన భర్త ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్లే కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన తన భార్య బిడ్డ మృతి చెందారని, ఇందుకు కారణమైన గైనకాలజిస్ట్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
