50శాతం సడ్సిడీపై పశువుల దాణా పంపిణీ

ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా 50శాతం సబ్సిడీపై అందిస్తున్న పశువుల దాణాను ఉపయోగించుకోవాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ వి ప్రతాప్ రెడ్డి కోరారు. మాధవరంలో సబ్సిడీపై పశువుల దాణాను 50 మంది రైతులకు శుక్రవారం అందించారు. 50 కిలోల రూ. 1,110 విలువైన దాణాను రూ. 555 లకు అందించినట్లు చెప్పారు. 50 మంది రైతులకు క్వింటా చొప్పున 4.4 మెట్రిక్ టన్నుల దాణాను పంపిణీ చేసారు. గ్రామ సర్పంచి తాటికొండ రేణుక, గ్రామ నాయకులు సోము శ్రీనివాస రెడ్డి, సుసుం క్రిష్ణా రెడ్డి, ఎహెచ్ ఎ ఆంజనేయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *