ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి సమస్యలను ధైర్యంగా ఎస్పీ కి మరియు పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ మరియు అధికారులు 65 ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, జాబ్/మనీ మోసాలు, మరియు ఇతర సమస్యల గురించి ప్రజలు వినతులను ఇచ్చినారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి పిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. అలాగే పిర్యాదులు స్వీకరించినప్పటీ నుండి క్లోజ్ అయ్యేంతవరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కావున అధికారులందరూ వారు తీసుకుంటున్న చర్యలపై రిప్లైలు పంపాలని కూడా ఆదేశించారు. మీకోసం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళ డిఎస్పీ రమణ కుమార్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


