సాగును లాభసాటిగా మార్చుకునేందుకు ప్రతి రైతు తగిన సూచనలు, సలహాలు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. శివరామపురం, మల్కాపురం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వాతావరణ మార్పులకు బట్టి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని కోరారు. కౌలు రైతులు పంట సాగు హక్కు పత్రం పొందాలని, ఈ-క్రాప్ ప్రాముఖ్యతను వివరించారు. విఏఏ ఎం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
